Telangana | 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

Telangana | 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో భానుడు భ‌గ‌భ‌గ మండుతున్నాడు. ప‌లు జిల్లాల్లో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. సూర్య ప్రతాపానికి రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పగలంతా భానుడి భగభగలు, రాత్రంతా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రత, వడగాలులకు ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎండల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఎండలకు వడగాలులు తోడవ్వడంతో 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప‌ని నిమిత్తం బ‌య‌ట‌కు వచ్చినా వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పండ్ల రసాలను తీసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా పలు జాగ్రతలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. గత ఐదు రోజులుగా ఎన్నడూ లేనంతగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఈ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి.

Leave a Reply