Final 1 | ఆ పాత్రలో ఎవ‌రు?

Final 1| ఆ పాత్రలో ఎవ‌రు?

  • స్పీడ్ అందుకున్న వార‌ణాసి సినిమా షూటింగ్‌
  • ఆ పాత్రధారి కూడా షూటింగ్‌లో అడుగుపెట్టిన‌ట్లు స‌మాచారం
  • రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రెండో సినిమా

Final 1 | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మహేశ్‌, రాజమౌళి కాంబినేష‌న్‌లో వారణాసి షూటింగ్(Varanasi shooting) సూపర ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమాలో మహేశ్‌, ప్రియాంక చోప్రా, ఫృథ్వీ న‌టిస్తున్న‌సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. కానీ ఆ ఒక్క పాత్ర ఎవ‌రికి ఇస్తార‌న్న‌ది ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల మ‌దిలో ఒక ప్ర‌శ్న‌. దీనికి ఎక్క‌డా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కూడా క్లారిటీ ఇవ్వ‌లేదు. మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ(Pan World Movie) వారణాసి గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు సాధార‌ణంగా జ‌రిగింది.

అయితే ఈ షూటింగ్ స్పీడ్ పెంచే ప‌నిలో ప‌డ్డాడు జ‌క్క‌న్న‌. ఆయన కెరీర్ లోనే ఈ సినిమా సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేసి రికార్డ్ సాధించబోతున్నట్టు సినీప‌రిశ్ర‌మ‌లో(In the film industry) ఒక చ‌ర్చ‌. ఈ సినిమాలో మహేశ్‌, ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించి, ఇతర పాత్రలపై రాజమౌళి ఎటుంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇంతకీ ఈ సినిమాతో ఇంకా ఎవరెవరు నటిస్తున్నారు? ఈ సినిమాకు కీలకంగా నిలిచే మహేశ్‌ తండ్రి పాత్రలో కనిపించబోయేది ఎవరు? అనేది ప్ర‌స్తుతం సినీ వ‌ర్గాల్లో(In film categories) చ‌ర్చ జ‌రుగుతుంది.

Final 1 | ఆ పాత్ర‌కు మిస్సైన ముగ్గురు ఎవ‌రు?

మ‌హేశ్‌బాబు తండ్రి పాత్రకు మిస్సైన ముగ్గరు హీరోలు ఎవరో తెలుసా? ముందుగా ఈ క్యారెక్టర్ కోసం టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జునను జక్కన్న టీమ్ అనుకున్నారట. నాగార్జున కూడా ముందుగా ఈ పాత్ర కోసం గ్రీన్ సిగ్నల్(Green signal) ఇచ్చినా.. ఆ తరువాత ఎందుకో ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారన్న టాక్ వినిపించింది. ఆ తరువాత మహేష్ తండ్రి పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విక్రమ్ ను కలిశారట. ఈ క్యారెక్టర్ తనకు సూట్ కాదని భావించి తిరస్కరించినట్టు(Rejected) తెలుస్తోంది. ఈ సినిమాలో హనుమంతుని పాత్ర కోసం మాధవన్ ను తీసుకున్నారని తెలిసింది. ఆ తరువాత హనుమాన్ పాత్రకు కాదు.. మహేష్ తండ్రి పాత్ర కోసం మాధవన్ ను తీసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన కూడా ఈ సినిమాలో నటించడంలేదని తెలుస్తోంది.

Final 1 | చివ‌ర‌కు విల‌క్ష‌ణ న‌టుడు…

Final 1
Final 1

మ‌హేశ్ బాబు తండ్రి పాత్రకు చివరకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. షూటింగ్ సెట్స్‌(Shooting sets)లోకి కూడా ఎంట్రీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్‌లది హిట్ కాంబినేషన్. ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. మ‌హేశ్‌ సినిమాల్లో(Mahesh in movies) ప్రధానంగా విలన్ పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్, ఆ తరువాత‌ కాలంలో తండ్రి పాత్రల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘మహర్షి’ వంటి సినిమాల్లో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వారణాసిలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడా లేదా అనేది జక్కన్న క్లారిటీ ఇచ్చే వ‌ర‌కూ స్ప‌ష్ట‌త రాదు.

CLICK HERE TO READ మరో జాతిరత్నాలు కానుందా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply