MLA | ఆర్థిక రాజధానిగా అమరావతి..

MLA | ఆర్థిక రాజధానిగా అమరావతి..
- ముఖ్య బ్యాంకుల ఏర్పాటు శుభ పరిణామం..
- అమరావతికి రావడంలో అధికారుల పాత్ర కేలకం..
- తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు..
- ఢిల్లీలో ఆర్ధిక శాఖ అధికారులతో మర్యాదపూర్వక భేటీ..
MLA | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రపంచ దేశాలకే తలమానికంగా అమరావతి రూపొందుతుందని, ఇందులో అతి ముఖ్యమైన ఆర్థిక రాజధానిగా మారడం ఖాయమని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఇటీవల అమరావతిలో 29 బ్యాంకింగ్ సంస్థల ఏర్పాటులో కీలక భూమి పోషించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (University) తన సహచర మిత్రుడు కేంద్ర ఆర్థిక శాఖలో ఆర్థిక సర్వీసుల శాఖ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి మద్దిరాల నాగరాజును ఢిల్లీలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇవాళ ఢిల్లీలో ఆయన కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయిన ఎమ్మెల్యే (Mla) కొలికపూడి శ్రీనివాసరావు అమరావతిలో 29 ముఖ్యమైన బ్యాంకుల ఏర్పాటు, వాటి కార్యకలాపాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అమరావతి రాజధానిలో జరుగుతున్న పనులు, వాటి ప్రగతి రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు అందించే ఫలాల వివరాలను ఆయన వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఎమ్మెల్యే కొడుకు శ్రీనివాసరావు పలువురు పెద్దలను కూడా కలుసుకోనున్నారు.
