AP | రిటైర్డ్ ఐపీఎస్‌కు కీలక పదవి…
- పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఏబీవి
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా ఏబీవీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగున్నారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏబీవీ రెండుసార్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై ఉన్న అభియోగాలను సాక్ష్యాల్లేని కారణంగా ఇటీవలే ఉపసంహరించుకున్నారు. ఆమనపై సస్పెన్షన్ ఎత్తివేసి.. సస్పెన్షన్ కాలానికి సంబంధించిన వేతనాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఇక తాజాగా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా ఏబీ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు.