CM Revanth Reddy | రామగుండం అభివృద్ధికి కట్టుబడి ఉన్న….

CM Revanth Reddy | రామగుండం అభివృద్ధికి కట్టుబడి ఉన్న….
–— భవిష్యత్తుపై ప్రజలకు భరోసా
… ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్
… నగరంలో విస్తృత పర్యటన
CM Revanth Reddy | గోదావరిఖని, ఆంధ్రప్రభ : రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. కార్పొరేషన్ పరిధి గోదావరిఖని పట్టణంలోని పలు డివిజన్లలో ఈ రోజు తెల్లవారుజామునే ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పర్యటించారు. బైక్ పై వెళ్లి ప్రజలను కలిసి భవిష్యత్తుపై భరోసా కల్పించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్దేశించిన ప్రజా పాలన నేపథ్యంలో ఇంటింటికి, గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి వివరించారు.
ప్రజల వద్దకు వెళ్లి వారు చెప్పే సమస్యలను సవినయంగా ఉంటూ పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని సిక్కుల వాడా, లక్ష్మీ నగర్, కళ్యాణ్ నగర్ పరిసర ప్రాంతాలలో బైక్(bike) పై తిరుగుతూ ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ… మీ కుటుంబంలో ఒకడిగా ఉండే తనకు ఎప్పటికప్పుడు సమస్యలు వివరించాలని సూచించారు. అనంతరం వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఇల్లు లేని వారికి ఇంటి సదుపాయాన్ని కల్పించడంతోపాటు ఆయా ప్రాంతాలలో డ్రైనేజీ, రోడ్లు, స్ట్రీట్ లైట్స్(street lights), మంచినీటికి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు.
అభివృద్ధి దిశగా వెళ్లే తనకు అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఎదుర్కొని ప్రజా శ్రేయస్సు ధ్యేయమని పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. తాత్కాలికంగా జరిగే కొన్ని ఇబ్బందులకు భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం(solution) లభిస్తుందని పేర్కొన్నారు. డివిజన్ స్థాయిలో ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తున్నామన్నారు. అయితే ఇందుకోసం కోట్లాది రూపాయల నిధులను కూడా సమీకరించామని అన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులు ఉన్నారు.
