3.39 crores | వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ

3.39 crores | వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ

3.39 crores | నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో వివిధ మహిళా సంఘాలకు 3.39 కోట్ల(3.39 crores) రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు(MLA Camp) కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం ఈ చెక్కులను అందజేశారు.

నర్సంపేట డివిజన్ లోని 4006 మహిళా సంఘాలకు గాను మూడు కోట్ల 39 లక్షల రూపాయల చెక్కులను మహిళలకు అందజేశారు. నర్సంపేట మండలానికి 825 సంఘాలకు 76 లక్షల రూపాయల(76 lakh rupees for 825 Sanghas)ను సంఘ సభ్యులకు చెక్కుల రూపంలో అందించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డిఆర్డిఓ రామ్ రెడ్డి,ఆర్డీవో ఉమా రాణి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, డీపీఎంలు అనిల్, శంకర్, ఆరు మండలాల ఏపీఎంలో మండల సమాఖ్య అధ్యక్షులు, తాసిల్దారులు లబ్ధిదారులు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply