BIGG BOSS 9 | FINALE | ట్రోఫీకి ఆ ఇద్ద‌రే ప్ర‌ధాన పోటీ!

BIGG BOSS 9 | FINALE | ట్రోఫీకి ఆ ఇద్ద‌రే ప్ర‌ధాన పోటీ!

  • బిగ్‌బాస్ ట్రోఫి ఆశించేది న‌లుగురు

BIGG BOSS 9 | FINALE | బిగ్‌బాస్ -9 సీజ‌న్ ట్రోఫీ ప్ర‌దానోత్స‌వం కార్య‌క్ర‌మానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి. బ‌హుశ ఆదివారం బిగ్‌బాస్ ఫినాలే ఉంటుందని హోస్ట్ నాగార్జున అక్కినేని మాట‌లు బ‌ట్టీ అర్థ‌మ‌వుతుంది. అయితే ఈ సారి ఫినాలేకి ఎవ‌రు వ‌స్తార‌న్న‌దే కూడా ఒక ప్ర‌శ్న‌. టాప్‌-5కి చేరిన ఐదుగురులో క‌ళ్యాణ్ పడాల‌, త‌నూజ గౌడ, డీమాన్ ప‌వ‌న్ గ‌ట్టిగా పోటీ ప‌డుతున్నారు. వీరిలో టైటిల్ కొట్టాల‌ని మొద‌టి నుంచి గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తుంది క‌ళ్యాణ్ ప‌డాల‌. అలాగే టాప్‌-5 చేరువ ద‌శ‌లో ఉన్న త‌నూజ గౌడ్ కూడా ఎలాగైనా టైటిల్ కొట్టాల‌ని ప్ర‌య‌త్నం ప్రారంభించింది. అందుకే ప్రేక్ష‌కుల మ‌ద్ద‌తు కూడా కోరుతున్నారు. నిన్నటి నుంచి ప్రారంభ‌మైన ఓటింగ్ శుక్ర‌వారం అర్ధ‌రాత్రి వ‌ర‌కూ ఉంటుంది. అయితే బిగ్‌బాస్ ట్రోఫీ కోసం క‌ళ్యాణ్ ప‌డాల‌, త‌నూజ గౌడ మ‌ధ్య పోటీ జ‌రుగుతుంద‌ని ప్రేక్ష‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

BIGG BOSS 9 | FINALE | క‌ళ్యాణ ప‌డాల‌…

BIGG BOSS 9

ఆర్మీలో ప‌నిచేసిన క‌ళ్యాణ్‌ ప‌డాల మొద‌టి మూడు వారాలు డ‌ల్ల్‌గా ఉన్నా ఆ త‌ర్వాత ఆట తీరు, ప్ర‌వ‌ర్త‌న మార్చుకుని టాప్ -5కి చేరాడు. అలాగే మొద‌టి ఫైన‌ల్ లిస్టుకు కూడా చేరుకున్నాడు. కళ్యాణ్ పడాల మొదట బిగ్ బాస్ అగ్నిపరీక్ష సమయంలో కీర్తిని పొందాడు. అతను ఒక “సామాన్యుడు”, అతను ఇంట్లోకి ప్రవేశించి వివిధ టాస్క్‌లు, బలమైన ఆట వ్యూహం ద్వారా ఫైనల్‌లో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అభిమానులు తరచుగా సైనికుడు కళ్యాణ్ పడాల అని పిలుస్తారు. విజేత టైటిల్ కోసం ఓ సైనికుడిలా ప‌రుగులు తీస్తున్నాడు.

BIGG BOSS 9 | FINALE | త‌నూజ గౌడ్‌…

BIGG BOSS 9

తనుజ పుట్టస్వామి అని కూడా పిలుస్తారు. దక్షిణ భారత సినిమా, టీవీ పరిశ్రమలో నటి. తెలుగు, కన్నడ, తమిళ సినిమాలు, టెలివిజన్‌లలో పనిచేసిన ఆమె, జీ తెలుగులో విజయవంతమైన ముద్ద మందారంలో ప్రధాన పాత్ర పోషించి బాగా గుర్తింపు పొందింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ – 5 కి చేరింది. బెంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తనూజ కన్నడ హర్రర్ చిత్రం 6-5=2 (2013)తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం తరువాత తెలుగులోకి చిత్రం కడు నిజం అనే పేరుతో డబ్ చేయబడింది, ఇది ఆమెకు విస్తృత గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమె కన్నడ చిత్రం దండే బాయ్స్‌లో నటించింది.

క్రమంగా పరిశ్రమలో తన ఉనికిని చాటుకుంది. తనూజ అందాల రాక్షసితో తెలుగు బుల్లితెరపై అరంగేట్రం చేసింది. కానీ జీ తెలుగులో బ్లాక్‌బస్టర్ సీరియల్ ముద్ద మందారంలో ఆమె పాత్ర ఆమెకు ఇంటి పేరు తెచ్చిపెట్టింది. 1,500 ఎపిసోడ్‌లకు పైగా నడిచిన ఈ సీరియల్ తెలుగు టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన షోలలో ఒకటిగా మారింది. త‌న తండ్రికి, అలాగే బిగ్ బాస్‌లో నాన్న అనే పిలిచే భ‌ర‌ణికి మాట ఇస్తూ నేను ఎలా అయిన ట్రోఫీతో బ‌య‌ట‌కు వ‌స్తాను అని మాట ఇచ్చింది.

BIGG BOSS 9 | FINALE | డీమాన్ ప‌వ‌న్‌..

BIGG BOSS 9

త‌ణ‌కుకు చెందిన ఉప్పల పవన్ కుమార్ అలియాస్‌ డీమాన్ ప‌వ‌న్ కూడా చివ‌రి నామినేష‌న్ ప్ర‌క్రియ జ‌రిగిన‌ప్పుడు తానే ట్రోఫీ కొడ‌తాను అని అన‌డం బ‌ట్టి చూస్తే ఆత్మ విశ్వాసం పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు. చివ‌రి వారంలో డీమాన్ ప‌వ‌న్ యాక్టీవ్ గా ఉన్నాడు. ప్రేక్ష‌కుల మ‌ద్ద‌తులో ఫైన‌ల్ లిస్టుకు చేరాడు. ఇప్ప‌డు క‌ప్ప కొట్ట‌డానికి ప్ర‌య‌త్నంలో ఉన్నాడు.

BIGG BOSS 9 | FINALE | ఇమ్మ‌న్యూయేల్‌…

BIGG BOSS 9

ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టాప్‌-5 పోటీదారుడు., జబర్దస్త్ఇ మ్మాన్యుయేల్ అని పిలుస్తారు. హాస్యనటుడు. ఆయ‌న‌కు జ‌బ‌ర్డ‌స్ట్ మంచి పేరు తీసుకు వ‌చ్చింది. బిగ్ బాస్ విజేత ట్రోఫీ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. బిగ్‌బాస్ లో అడుగు పెట్టినప్పుడే ట్రోఫీ కొట్టాల‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు.

CLICK HERE TO READ పవర్ స్టార్ గిఫ్ట్..

CLICK HERE TO READ MORE

Leave a Reply