CONGRESS | సోనియా గాంధీని తెలంగాణ మరువదు…

CONGRESS | సోనియా గాంధీని తెలంగాణ మరువదు…

CONGRESS | పరకాల, ఆంధ్రప్రభ : సోనియా గాంధీని తెలంగాణ మరువదని పరకాల పట్టణ కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకలను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ కూడలిలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

అనంతరం సోనియాగాంధీ (Sonia Gandhi) చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ… ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోరండ్ల సంతోష్, మడికొండ శ్రీను, మడికొండ సంపత్, ఒంటెరు శ్రావణ్, దుబాసి వెంకటస్వామి, దార్న వేణుగోపాల్, పోరండ్ల వేణు, పంచగిరి జయ్యమ్మ, పసుల విజయ, కోమలా, బొచ్చు భాస్కర్, గడ్డం శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply