Indigo Crisis | PM | వ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుప‌ర్చేందుకే నిబంధ‌న‌లు

Indigo Crisis | PM | వ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుప‌ర్చేందుకే నిబంధ‌న‌లు

Indigo Crisis | PM |వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలని… ప్రజలను వేధించడానికి కాదని ప్ర‌ధాని మంత్రి న‌రేంద‌ర్ మోడీ(Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. ఇండిగో సంక్షోభం కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై స్పందించారు.

మంగళవారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యల వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియా(Rijiju media)కు వెల్ల‌డించారు. వారం రోజులకు పైగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విమానాల ర‌ద్దుతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తూ ఇబ్బందిపడుతోన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.

సమస్య పరిష్కారం దిశగా కేంద్రం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ అంతరాయాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలను కేంద్రం ఇప్పటికే సీరియస్(Serious) గా తీసుకుంది. దీనిపై విచారణ కమిటీని కూడా వేసింది. ఈ ప‌రిణ‌మాల‌పై ప్ర‌ధాన మంత్రి మాట్లాడిన‌ట్లు స‌మాచారం.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన అపూర్వ విజయం‍పై ప్రధాని మోడీకి ఎన్డీయే నేతలు ఘన సన్మానం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయాన్ని బలోపేతంతో పాటు ఫ్లోర్ స్ట్రాటజీని క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఎల్లుండి ప్రధాని మోడీ అన్ని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(National Democratic Alliance) ఎంపీలకు ప్రత్యేక విందును నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

త్వరలో జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం అసెంబ్లీ ఎన్నికలపై సన్నాహక వ్యూహాలు ఈ భేటీలు చర్చించే అవకాశం ఉంది.