Palamuru | వైభవంగా కోనేరు ప్రారంభోత్సవం

Palamuru | వైభవంగా కోనేరు ప్రారంభోత్సవం


Palamuru | మక్తల్, ఆంధ్రప్రభ : పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ (Lord Anjaneya) స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్కరిణి (కోనేరు) ప్రారంభోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. గత కొన్ని దశాబ్దాలుగా పాడుబడిన కోనేరును స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సొంత ఖర్చులతో కోనేరు పునర్ధరణ, సుందరీకరణ పనులను గత 50 రోజులుగా చేపట్టారు. కోనేరు సుందరీకరణ పనులు పూర్తి కావడం డిసెంబర్ 2 నుండి 9వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు (జాతర) జరగనున్న సందర్భంగా వేదమంత్రోశ్చరణల మధ్య విశేష పూజలు పుష్కరిణీ ప్రారంభోత్సవ వేడుకలు ఆలయ వంశపార్యంపర్య ధర్మకర్త పి. ప్రాణేశాచారి, ఉడిపి పెజావర మఠం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ధర్మ ప్రచార విద్వాన్ కె. రాఘవేంద్ర ఆచార్య ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి.

ఈ వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి, లలిత దంపతులు (Lalitha couple) పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేష పూజల అనంతరం కోనేటి గంగ జలాలకు హారతి ఇచ్చి కోనేటినీ ప్రారంభించారు. అంతకుముందు వివిధ ప్రాంతాల నుండి కృష్ణ, గంగా, యమునా, కావేరి, గంగోత్రి, గోదావరి, సరస్వతి వంటి పుణ్య నదుల నుండి తీసుకువచ్చిన నది జలాలను కోనేటిలో వదిలి సంప్రోక్షణ గావించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, మాజీ సర్పంచ్ మాన్వి రామారావు, మాజీ జడ్పిటిసి జి. లక్ష్మారెడ్డి, నాయకులు బి. గణేష్ కుమార్, కట్ట సురేష్ కుమార్, కావాలి తాయప్ప, మంజునాథ్ ఆలయ ఈవో కవిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply