Candidate | సంధ్యారాణి గెలుపుతోనే..

Candidate | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఖిలాషాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి జీడికంటి సంధ్యారాణి రాజ్ కుమార్ గెలుపుతోనే ఖిలాషాపూర్ గ్రామం అభివృద్ధి చెందుతుందని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మంగు రామక్రిష్ణ, సీనియర్ యువజన నాయకులు రంగు సంతోష్ గౌడ్ లు అన్నారు. మంగళవారం ఉదయం సంధ్యారాణి రాజ్ కుమార్ గెలుపు కోసం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ సంధ్యారాణిని గెలిపిస్తే.. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో అధిక నిధులు, ఇండ్లు, సాగునీరు, సంక్షేమ పథకాలు తీసుకువచ్చి గ్రామం అభివృద్ధి చేస్తానని అన్నారు. పుట్బాల్ గుర్తుకు ఓటువేసి గెలిపించి గ్రామం అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని కోరారు

Leave a Reply