Award | ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు

Award | ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు

Award | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్(Journalist), ప్రముఖ లక్ష్మీ డిజిటల్ ఫోటోగ్రాఫర్ ఏళ్ల బయన్నకు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు(Award)ను అందుకున్నారు గాంధారి లంబాడా జీవన శైలి అంశం పై నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన తీసిన ఫొటోస్ కి సముచిత గౌరవం దక్కింది.

డిసెంబర్ 6 ,7 తేదీల్లో తెలుగు ఆర్ట్ ఫోటోగ్రఫీ, వివిద్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ నిర్వహించిన లంబాడా తెగకు జీవనశైలి గురించి ఆచార వ్యవహారాలపై తీసిన ఫొటోస్‌కు గాను అసోసియేషన్ నిర్వాహకులు కుమారస్వామి, రామకృష్ణ, భార్గవ్‌ల చేతుల మీదుగా ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డును అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ ఫోటోగ్రాఫర్ క్లిక్ శీను హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లంబాడా తెగల జీవన విధంగా పై బయన్న తీసిన ఛాయాచిత్రం(photograph) అత్యద్భుతంగా ఉన్నాయని, లంబాడా తెగ సంప్రదాయాలు ఉట్టి పడేలా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply