Electric | విద్యుత్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి

Electric | విద్యుత్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి

Electric | పామర్రు – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో విద్యుత్ షాక్(electric shock) తో విజయ్ బాబు (51) అనే ఎలక్ట్రీషియన్ ఈ రోజు మృతి చెందాడు.

గ్రామంలో ఓ ఇంటి వద్ద వైరింగ్(wiring) పని చేస్తుండగా, ప్రమాదం జరిగింది. విజయ్ బాబు మృతితో స్వగ్రామం చెన్నువానిపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విజయ్ బాబుకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. పామర్రు పోలీసులు(police) కేసు నమోదు చేసారు. పోస్టుమార్టం నిమిత్తం విజయ్ బాబు భౌతికకాయాన్ని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply