Bharat Army | ఆర్మీ అకాడమీ కృషి అభినందనీయం

Bharat Army | ఆర్మీ అకాడమీ కృషి అభినందనీయం

తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ జి.శ్రీనివాస్

Bharat Army | నారాయణపేట రూరల్, ఆంధ్రప్రభ : దామరిగిద్ద మండలం బాపన్ పల్లిలో ఏర్పాటు చేసిన మిల్కసింగ్ ఆర్మీ ట్రైనింగ్ అకాడమీ కృషి అభినందనీయమ‌ని తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ బాపన్ పల్లి ఏకగ్రీవ సర్పంచ్ గవినోల్ల శ్రీనివాస్ అన్నారు. వారి ఆధ్వర్యంలో సోమవారం అగ్నివిర్ కు ఎంపికైన‌ భారత ఆర్మీ (Bharat Army) జవాన్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అయ్యార్పల్లి రాఘవేంద్ర రెడ్డి, పీఈ టీ రమణ, వార్డు మెంబెర్స్ మెట్టు నర్సింహా, దేవేందర్, నాగయ్య స్వామి పాల్గొన్నారు.

ఈసందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం బాపన్ పల్లిలో ఏర్పాటు చేసిన ఈ ఆర్మీ అకాడమీ నుండి 60 మంది ఎంపిక కావడం సంతోష దాయకమన్నారు. ఈ అకాడమీ బాధ్యులు కావలి మహేష్ (Mahesh) ను మనస్ఫూర్తిగా అభినందించారు. అకాడమీకి వెన్నంటి ఉన్న గవినోళ్ల ఉదయ్ కు అభినందనలు తెలిపారు. రాఘవేంద్ర రెడ్డి కూడా అకాడమీకి వెన్నంటే ఉండి సహాయం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. ఈ సంవత్సరం ఈ బాపన్ పల్లిలో ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా జిల్లా వ్యాప్తంగా యువత కు శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాటు చెయ్యాలని అకాడమీ బాధ్యులకు సూచించారు. దానికి అయ్యే ఖర్చు కూడా భరిస్తాన‌ని చెప్పారు. బాపన్ పల్లిలో ఇంతవరకు 12మంది ఆర్మీకి ఎన్నిక కావడం సంతోషమ‌న్నారు. ఆర్మీకి ఎంపికైన‌ అందరికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి సన్మానం చేసి దేశ సేవకు ముందుకు రావడం సంతోషమ‌న్నారు.

Leave a Reply