నూతన ఎంపీడీవోను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల నూతన ఎంపీడీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పావనిని బుధవారం మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో పావని మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పనిచేస్తానని పేర్కొన్నారు. మండల అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డి. యగ్నేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సూర్యప్రకాశ్ రెడ్డి, సమస్తపూర్ సర్పంచ్ జయప్రకాశ్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోరం మహేశ్ రెడ్డి, నాయకులు గోపాల్ రెడ్డి, కొక్కు శంకర్, అర్ఫాత్, రామకృష్ణ, రాఘవేందర్ గౌడ్, తమ్మిరెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
