Treatment | స్ర్కబ్ టైఫస్ తో ఇద్దరు మృతి..
Treatment | గుంటూరు, ఆంధ్రప్రభ : ఏపీలో కొత్త రకం స్క్రబ్ టైఫస్ వ్యాధి సంచలనం సృష్టిస్తోంది. స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంకు చెందిన పి.ధనమ్మ(61) డేగవారిపాలెంకు చెందిన డి.నాగేంద్రమ్మ (73) మృతి చెందగా, ఆరుగురు చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి గుంటూరు వైద్య కళాశాల వైరాలజీ ల్యాబ్లో ప్రైమరీ టెస్టులు నిర్వహిస్తున్నారు. గత నెలలో పల్నాడు జిల్లాలో కూడా ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.

