development villagers | ఎల్లవేళలా అందుబాటులో ఉంటా

development villagers | ఎల్లవేళలా అందుబాటులో ఉంటా

development villagers | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : భట్టుపల్లి గ్రామమే మా దేవాలయం అని, ప్రజలే మా దేవుళ్ళని బందెల శారద లక్ష్మణ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మంథని మండలం భట్టుపల్లి గ్రామం నుంచి బందెల శారద లక్ష్మణ్(Sarada Lakshman) సర్పంచ్ బరిలో ఉన్నారు. మరోసారి ఆశీర్వదించాలని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలంతా ఏకమై మరోసారి ఆశీర్వదించి, అవకాశం కల్పించాలని అని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.

ఫుట్ బాల్ గుర్తుకు ఓటేయాలని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. గతంలో సర్పంచ్ చేసిన హయాంలో పేద ప్రజల(people) కోసం నిత్యం పాటుపడ్డట్లు వారు తెలిపారు. గ్రామస్తుల అభివృద్ధియే(development of the villagers) మా ముఖ్య కర్తవ్యమని వారు పేర్కొన్నారు.

నిరుపేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు వారు అందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల అందిస్తామని, మరోసారి ఆశీర్వదించాలని వారు కోరారు. గ్రామస్తులకు ఆపద వస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుంటామని, వారి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

Leave a Reply