IndiGo | ఇండిగో కష్టాలు మరో 3-4 రోజులు…
- ఎయిర్‌బస్‌లా.. ఎర్రబస్‌లా..
- కొనసాగుతున్న ఇండిగో క్రైసిస్
- ప్రయాణికుల పాకెట్లకు చిల్లు
- గాల్లో ధరలు, నేలపైనే విమానాలు
- ఇంకొన్ని రోజులు ఇబ్బందులు తప్పవు
ఆంధ్రప్రభ : దేశీయ విమానయాన రంగంలో మరొకసారి తీవ్రమైన సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో (IndiGo) వరుసగా నాలుగు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
ఇవి ఎయిర్‌బస్‌లా లేక ఎర్రబస్‌లా అన్నట్టుగా… ఒకప్పుడు రోడ్లపై నడిచే ఎర్రబస్‌లకన్నా కూడా అద్వానంగ ఈ ప్లైట్లు మరింత ఇబ్బందులు పెడుతున్నాయంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒకే రోజు 500 కి పైగా విమానాలు రద్దు..
సాంకేతిక లోపాలు కారణంగా శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా IndiGo 500కి పైగా విమానాలను రద్దు అయినట్టు సమాచారం. గత నాలుగు రోజుల్లో ఇండిగో రద్దు చేసిన విమానాల సంఖ్య దాదాపు 1,000కి చేరువలో ఉంది. ఈ టెక్నికల్ ఇష్యూ కారణంగా దేశంలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ అస్తవ్యస్తంగా మారాయి.

దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలో నిలిచిపోగా, టెర్మినళ్ల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ లాబీల్లో గంటల తరబడి పడి గాపులు కాస్తున్నారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన IndiGo విమానం ఏకంగా 12 గంటల పాటు ఆలస్యం కావడంతో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం సాయంత్రమే విమానాశ్రయానికి చేరుకున్న అయ్యప్ప భక్తులు, శుక్రవారం ఉదయానికి కూడా విమానం బయలుదేరకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాన నగరాల్లో ఇలా..
ఇండిగోలో తలెత్తిన టెక్నికల్ ఇష్యూ దేశంలోని ప్రధాన నగరాల్లో విమాన రవాణా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజులోనే 225 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లో శుక్రవారం మొత్తం 92 విమానాలు రద్దయ్యాయి. వీటిలో 49 డిపార్చర్లు, 43 అరైవల్స్ ఉన్నాయి.

ఇక ముంబై విమానాశ్రయం నుండి బయలుదేరాల్సిన 53 విమానాలు, చేరాల్సిన 51 విమానాలు.. మొత్తం 104 సర్వీసులు రద్దయాయి. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయానికి కనీసం 102 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి.
చెన్నై ఎయిర్‌పోర్ట్ కూడా రద్దయిన విమానాల వివరాలను ప్రకటించింది. విడుదల చేసిన జాబితాలో అన్నీ ఇండిగో విమానాలేనని స్పష్టంగా తెలిపింది. చెన్నై నుంచి మాత్రమే 30కు పైగా విమానాలు రద్దు అయినట్లు ఎయిర్‌పోర్ట్ తమ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. పూణే విమానాశ్రయ పరిస్థితి కూడా భిన్నంగా లేదు.. అర్ధరాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా 32 విమానాలు నిలిచిపోయాయి.
డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జిల బాదుడు
ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలను రద్దు కావడంతో ప్రయాణికులు వేరే ఎయిర్‌లైన్స్‌లలో టికెట్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇదే అదునుగా ఇతర ఎయిర్‌లైన్స్… ముఖ్యంగా స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎయిర్లైన్ సంస్థలు ఈ సంక్షోభాన్ని తమకు అవకాశంగా మార్చుకున్నాయి.
దేశంలో విమానయాన సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచేసి… ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవలు సాంకేతిక లోపాల కారణంగా దేశవ్యాప్తంగా రద్దు కావడంతో, విమానాల షెడ్యూళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని ఇతర ఎయిర్‌లైన్స్ అవకాశం గా మలుచుకున్నాయి. విమానయాన సంస్థలు ఒక్కసారిగా డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జీలను భారీగా పెంచేశాయి. దీంతో టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న భారీ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ, ఢిల్లీ–హైదరాబాద్ టికెట్ ధరలను ఏకంగా రూ.89వేలకు పెంచేశాయి ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు. ఇక, ఢిల్లీ–ముంబై టికెట్ ధరలను రూ.40,000 వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్–విజయవాడ వంటి తక్కువ దూర ప్రయాణాలకు కూడా రూ.18,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో తప్పనిసరిగా ప్రయాణించాల్సిన వారు ఈ పెరిగిన ధరలను భరించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇండిగో కష్టాలు ఇంకో 3-4 రోజులు…
మరోవైపు, ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన ఈ సాంకేతిక సమస్య, విమానాల రద్దులపై సంస్థ తాజాగా స్పందించింది. ఈ టెక్నికల్ ఇష్యూ పూర్తి పరిష్కారానికి మరో మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని ఇండిగో అధికారికంగా ప్రకటించింది.
దీంతో, ఇప్పటికే వరుసగా నాలుగు రోజులుగా విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. మరో మూడు-నాలుగు రోజులు ఈ తిప్పలు తప్పవా… అని ప్రయాణికులు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, ఇండిగో విమాన సేవలు సాధారణ స్థితికి రావడానికి ఇంకొన్ని రోజులు పట్టవచ్చని ప్రకటించడంతో… ప్రయాణికుల కష్టాలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

పుతిన్‌తో భారత్ చర్చల అనంతరం డాలర్ అవసరం తగ్గనుందా?
దేశీయ విమానయాన రంగంలో మరొకసారి తీవ్రమైన సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో (IndiGo) వరుసగా నాలుగు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
దేశీయ విమానయాన రంగంలో మరొకసారి తీవ్రమైన సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో (IndiGo) వరుసగా నాలుగు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
దేశీయ విమానయాన రంగంలో మరొకసారి తీవ్రమైన సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో (IndiGo) వరుసగా నాలుగు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
దేశీయ విమానయాన రంగంలో మరొకసారి తీవ్రమైన సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో (IndiGo) వరుసగా నాలుగు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
దేశీయ విమానయాన రంగంలో మరొకసారి తీవ్రమైన సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారతదేశంలో అతి
పెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో (IndiGo) వరుసగా నాలుగు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీంతో
దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దేశీయ విమానయాన రంగంలో మరొక
దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దేశీయ విమానయాన రంగంలో మరొకసారి తీవ్రమైన సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో (IndiGo) వరుసగా నాలుగు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దేశీయ విమానయాన రంగంలో మరొకసారి తీవ్రమైన సంక్షోభ పరిస్థితి నెలకొంది.
భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో (IndiGo) వరుసగా నాలుగు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దేశీయ విమానయాన రంగంలో మరొకసారి తీవ్రమైన సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో (IndiGo) వరుసగా నాలుగు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
దేశీయ విమానయాన రంగంలో మరొకసారి తీవ్రమైన సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో (IndiGo) వరుసగా నాలుగు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దేశీయ విమానయాన రంగంలో మరొకసారి తీవ్రమైన సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో (IndiGo) వరుసగా నాలుగు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది. దేశీయ విమానయాన రంగంలో మరొకసారి తీవ్రమైన సంక్షోభ పరిస్థితి నెలకొంది. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో (IndiGo) వరుసగా నాలుగు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతోంది.

