Market | రూ. 22 లక్షల విలువైన విత్తనాలు సీజ్

Market | రూ. 22 లక్షల విలువైన విత్తనాలు సీజ్
- ఎమ్మిగనూరు మార్కెట్లో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు.
Market | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఎమ్మిగనూరు మార్కెట్లో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు (Unannounced inspections) నిర్వహించారు. అక్కడ భారీ స్థాయిలో నకిలీ విత్తనాలు నిల్వ ఉంచిన గోదామును సీజ్ చేశారు. రూ.22 లక్షల విలువైన విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై వ్యవసాయ శాఖ ప్రత్యేక దళం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
తనిఖీలో లేబుళ్లు మార్చిన విత్తన బస్తాలు, కాలపరిమితి దాటిన స్టాక్, అలాగే రైతులను (Farmer) మోసగించేందుకు వాడిన నకిలీ బ్రాండ్ స్టికర్లును అధికారులు గుర్తించారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం ఇవన్నీ రైతులకు మార్కెట్‌కు తీసుకువచ్చే రోజుల్లో అధిక ధరలకు విక్రయించే ఉద్దేశంతో నిల్వచేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో లైసెన్సుగల (Licence) దుకాణాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని, అనుమానాస్పదమైన స్టాక్ కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారమివ్వాలని అధికారులు సూచించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇటువంటి ఆకస్మిక దాడులు కొనసాగుతాయని స్పష్టంచేశారు.
