Transport facility | మార‌ని చెంచుల వెతలు…

Transport facility | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మండలంలోని అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు గిరిజనులు ఎదుర్కొంటున్న దుస్థితి మరొక్కసారి మన పాలకుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. ఈ రోజు ఉదయం అత్యవసర పరిస్థితిలో పరీక్షల నిమిత్తం చెంచు నిండు గర్భిణీ మహిళలు దాసరి పుష్ప (9 నెలల గర్భిణి), శీలం లీలావతి (8 నెలల గర్భిణీ) అచ్చంపేట మండలంలోని పులి దేవి బండ తండా నుండి సిద్దాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని(Primary Health Centre)కి 10కిలోమీటర్లకు పైగా ప్రాణాలను ఫ‌ణంగా పెట్టి నడవడం చెంచుల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరికి దర్పణం పట్టింది.

ప్రభుత్వాలు మారాయి… నాయకులు మారారు… కానీ పర్వత చెంచు జీవనం మాత్రం యథాతథం. మా జీవితాల పట్ల నాయకులు ఊక దంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం, ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్ళిపోవడమే కానీ త‌మ తలరాతలు మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెంచు మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సౌకర్యం(ambulance facility) కూడా కల్పించలేని అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

చెంచు, గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు(Schemes) ప్రకటిస్తుంది, అధికారులు ఫైళ్లలో అభివృద్ధి చూపిస్తారు… కానీ గిరిజనుల పల్లెలో మాత్రం ఒక వాహనం కూడా అందుబాటులో లేదని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా పాలకులు, అధికారులు రవాణా సౌకర్యాని(transport facility)కి దూరంగా జీవిస్తున్న మహిళలు, గర్భిణి, పసిపిల్లలు, వృద్ధుల అత్యవసర ఆరోగ్య పరిరక్షణకు అంబులెన్స్ సౌకర్యాన్ని అన్నివేళలా అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

ఆశా కార్యకర్త నుండి త‌మకు ఎలాంటి షెడ్యూలు లేనందుననే 102 వెహికల్(102 Vehicle) ను అరేంజ్ చేయలేకపోయామని నాగర్ కర్నూల్ జిల్లా 102, 108 నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి బి.శ్రీనివాస్ తెలిపారు.

Click Here To Read More నిందితుల‌తో ఆ ప‌ని చేయించిన పోలీసులు…

Click Here To Read More

Leave a Reply