Andhraprabha | నూతన హంగులతో ఆంధ్రప్రభ దినపత్రిక

Andhraprabha | నూతన హంగులతో ఆంధ్రప్రభ దినపత్రిక
- ఆంధ్రప్రభ బ్రోచర్ ను విడుదల చేసిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
Jagadish Reddy | సూర్యాపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన హంగులతో ఆంధ్రప్రభ దినపత్రిక(Andhraprabha Daily Newspaper) రోజు రోజుకీ పాఠకులకు చేరువ అవుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణం(Suryapet town)లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన ఆంధ్రప్రభ బ్రోచర్ ను విడుదల చేశారు.
Andhraprabha | ఆంధ్రప్రభ యాజమాన్యం సరికొత్త హంగులతో
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్ మీడియా ప్రభంజనంలో ప్రింట్ మీడియా అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటుందని అలాంటి పరిస్థితుల్లో వాస్తవాలను(of facts) ప్రజలకు నిర్భయంగా చెప్పాలన్న ఒకే ఒక్క ఆలోచనతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆంధ్రప్రభ యాజమాన్యం సరికొత్త హంగులతో(With a new twist) పత్రికను తీర్చిదిద్ది పాఠకులకు అందజేయడం అభినందనీయమని కొనియాడారు.

ఆంధ్రప్రభ స్మార్ట్, వెబ్, యూట్యూబ్ ఛానల్స్ ను ఏర్పాటు చేసి ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని పాఠకులకు ఎప్పటికప్పుడు అందజేయడంలో ఆంధ్రప్రభ అన్ని పత్రికల కంటే ముందుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా(Electronic media)లో వచ్చిన విధంగా ఆంధ్రప్రభ వెబ్ ( prabhanews.com ) ద్వారా క్షణాల్లో వార్తను ప్రచురించడం సంతోషంగా ఉందన్నారు.
పత్రికలు అంటే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని, స్వాతంత్ర పోరాటంలో పత్రికలు ప్రజలను చైతన్యవంతం చేయడంలో చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేనిదన్నారు. శత వసంత ఉత్సవాలకు దగ్గరవుతున్న ఆంధ్రప్రభ దినపత్రిక ఎప్పటికీ ప్రజల పత్రికనేనని కొనియాడారు. ఆంధ్రప్రభ దినపత్రిక అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ దినపత్రిక ఉమ్మడి నల్లగొండ జిల్లా బి ఎం దంతాల ప్రవీణ్ కుమార్, ఆంధ్రప్రభ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
