Hundi | అంకమ్మ గుడిలో చోరీ..

Hundi | అంకమ్మ గుడిలో చోరీ..

Hundi | పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రులోని అంకమ్మ తల్లి ఆలయం(temple Ankamma)లో సోమవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ఛైర్మన్ ఇచ్చిన సమాచారం మేరకు.. దుండగులు గుడి తాళాలు పగులగొట్టి ప్రవేశించి, గునపంతో హుండీ(Hundi)ని పగలగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారని సీఐ శుభాకర్(CI Shubhakar) తెలిపారు.

కమిటీ సభ్యుల అంచనా ప్రకారం.. హుండీలో సుమారు రూ.4 వేల(Rs.4 thousand) నగదు దొంగిలించారని సీఐ వెల్లడించారు. ఈ ఘటనపై క్లూస్ టీం ఆలయ స్థలాన్ని పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.

Leave a Reply