scrub typhus | వైరల్ ఇన్ఫెక్షన్లు..

scrub typhus | వైరల్ ఇన్ఫెక్షన్లు..
scrub typhus | పామర్రు, ఆంధ్రప్రభ : వాతావరణంలో మార్పులు సంభవిస్తుండటంతో వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని పామర్రు సీజీహెచ్(CGH) వైద్యాధికారి డా.సూధేష్ బాబు తెలిపారు. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్(Malaria, Typhoid), డెంగ్యూతో పాటు కొత్తగా ‘స్క్రబ్ టైఫస్ ఫీవర్(scrub typhus fever)’ వైరస్ ప్రజలను అనారోగ్య సమస్యల్లోకి నెడుతోందన్నారు.
జలుబు, దగ్గు, జ్వరం, నొప్పులు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వ్యర్ధాలను పంచాయతీ పారిశుద్ధ కార్మికుల ద్వారా బయటకు తరలించాలని, మురుగునీరు నిల్వ ఉంటే తక్షణమే జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు.
