12th ward | జోరుగా బిఆర్ఎస్ ప్రచారం

12th ward | జోరుగా బిఆర్ఎస్ ప్రచారం

  • బీఆర్‌ఎస్ 12వ వార్డు అభ్యర్థి గంట కళావతి ఆధ్వర్యంలో

12th ward | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 12వ వార్డులో బీఆర్ఎస్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ 12వ వార్డు అభ్యర్థి గంట కళావతి ఆధ్వర్యంలో ఆదివారం రోజు పరకాల మున్సిపాలిటీ 12వ వార్డులో ఓటర్లను కలిసి బీఆర్ఎస్ ను గెలిపించాలని అభ్యర్థించారు. 12వ వార్డులోని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డి ఆశీస్సులతో 12వ వార్డులో విజయం సాధించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంట కళావతి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఓటర్లు ఆశీర్వదిస్తే, వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానని ఓటర్లకు తెలియజేశారు. అభ్యర్థి వెంట బిఆర్ఎస్ వార్డు నాయకులు ఉన్నారు.

Leave a Reply