Congress Party | కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

Congress Party | కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల (Kammarpalli Mandal) కేంద్రానికి చెందిన చింత వినీల ప్రదీప్ దంపతులు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వారికి కండువా (scarf) కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ, పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వం (Govt) లక్ష్యమని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు వంద శాతం (One hundred percent) అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుంకేట రవి (Sunketa Ravi), మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, వేణు గోపాల్ యాదవ్, నిమ్మ రాజేంద్రప్రసాద్, సుంకేట శ్రీనివాస్, నల్ల సాయికుమార్, కౌడ శైలెందర్, సంపంగి నాగరాజు, వేములవాడ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
