Gulf oil crisis 2026 : పశ్చిమాసియా అగ్నిగుండం Andhra Prabha Detail report

Gulf oil crisis 2026 : పశ్చిమాసియా అగ్నిగుండం Andhra Prabha Detail report

  • టెహ్రాన్ పై ఇజ్రాయెల్ టెంపరితనం
  • ఇరాన్ ప్రతీకారం
  • ప్రపంచం షాక్
  • గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్..
  • ఇజ్రాయెల్‌కు వార్నింగ్
  • కువైట్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు
  • మినా అల్ అహ్మది రిఫైనరీ ద‌హ‌నం
  • హైఫా ఆయిల్ ప్లాంట్ లక్ష్యం..
  • విద్యుత్ సరఫరా నిలిపివేత
  • గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్..
  • విమాన సర్వీసుల‌కు అంత‌రాయం
  • యుద్ధం మరింత తీవ్రత‌రం

ఆంధ్ర‌ప్ర‌భ‌, టెహ్రాన్ ప్ర‌తినిధి

Gulf oil crisis 2026

ఇరాన్ పై ఇజ్రాయెల్ ప‌గ ప‌రాకాష్ట‌కు చేరితే.. ఇరాన్ ప్ర‌తీకారం అమెరికా ఆత్మ‌బంధువుల‌పైకి మ‌ళ్లింది. ప‌శ్చిమాసియా అగ్నిగుండంగా మారింది. గ‌ల్ఫ్ దేశాల ఆర్థిక ఆయువు ప‌ట్టు ధ్వంస ర‌చ‌న ప్ర‌స్తుతం అమ‌లు జ‌రుగుతోంది. గ‌త 20 రోజులుగా యుద్ధం నాన్ స్టాప్ రేంజీలో సాగుతోంది. ఇరాన్ ఎక్క‌డ వెన‌క్కి త‌గ్గ‌టం లేదు. ఈ దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేయ‌టం త‌ప్ప మ‌రో మార్గం క‌నిపించ‌టం లేదు. ఈ స్థితిలోనే ఇజ్రాయెల్ .. అక‌స్మాత్తుగా ఇరాన్ కు చెందిన అతి పెద్ద అస‌లు సిస‌లు ఆర్థిక కేంద్రం అసలుయే రిఫైన‌రీ కేంద్రాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.

Gulf oil crisis 2026

ఈ ఒక్క కార‌ణంతో.. యావ‌త్ ప్ర‌పంచ దేశాలు ఈ రోజు.. గ్యాస్ క‌ష్టాల‌తో అల్లాడిపోతున్నాయి. త‌మ‌కు జ‌రిగిన న‌ష్టానికి ఇరాన్ భ‌య‌ప‌డ‌లేదు. త‌మ డ్రోన్ల‌ను, క్షిప‌ణుల‌ను సంధించింది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఖ‌తార్ గ్యాస్ కంపెనీ..రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ ని ఇరాన్ ధ్వంసం చేసింది. ఈ దాడితో ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సైతం అవాక్క‌య్యాడు. ప్ర‌పంచ దేశాల‌న్నీ అమెరికా, ఇజ్రాయెల్ జంట‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. మీ మ‌ధ్య చిచ్చును ప్ర‌పంచ దేశాలకు ఎలా అంట‌గ‌డ‌తార‌ని ప్ర‌పంచ దేశాలు ట్రంప్ ను నిల‌దీశాయి. నిగ్గ‌దీశాయి.

Gulf oil crisis 2026

అంతే.. బిక్క‌చ‌చ్చిన ట్రంప్ తొలుత ఇరాన్ సైన్యాన్ని బండ‌బూతులు తిటిన ట్రంప్‌.. ఆ త‌రువాత ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహూను మంద‌లించి.. చమురు క్షేత్రాల‌పై దాడులు చేయ‌వ‌ద్ద‌ని ఇజ్రాయెల్ ను ఆజ్ఞాపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇటు ఇరాన్‌, అటు లెబ‌నాన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తూ.. అమెరికాతో జాయింట్ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అంటూ గొప్ప‌లు పోయిన ఇజ్రాయెల్ అధిప‌తి మాట మార్చారు. అమెరికా జోక్యం లేకుండా త‌న‌కు తానే ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని కాసేపు ప‌క్క‌న పెడితే…

Gulf oil crisis 2026 : ఇరాన్ అస‌లు ఆగ‌ట్లే…

Gulf oil crisis 2026

ప్ర‌పంచంలోనే అతి పెద్ద గ్యాస్ కంపెనీ రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ ని గురువారం ధ్వంసం చేసింది. శుక్రవార‌మూ త‌న =ప్ర‌తీకార దాడిని కొన‌పాగించింది, ఈ సారి కువైట్ మీద విరుచుకుప‌డింది. కువైట్ లోని మినా అల్- అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి జ‌రిపంది. అనేకచోట్ల మంటలు చెలరేగాయి కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జాతీయ చమురు సంస్థను ఉటంకిస్తూ ప్రభుత్వ మీడియా తెలిపింది.

Gulf oil crisis 2026

ఇరాన్ తన ఫ‌త్వాహ్‌, ఖాద‌ర్ Qadr) బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ హైఫాలోని ఆయిల్ రిఫైనరీస్ లిమిటెడ్ (Bazan Group) ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుంది. క్షిపణి శకలాల‌తో ఒక పవర్ లైన్ దెబ్బతిని, ఉత్తర ఇజ్రాయెల్‌లో సుమారు 45 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రిఫైనరీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ప్రధాన మౌలిక సదుపాయాలకు ఎటువంటి శాశ్వత నష్టం కలగలేదని ఇజ్రాయెల్ ఇంధన శాఖ మంత్రి ఎలి కోహెన్ తెలిపారు. ఇజ్రాయెల్ వాయు రక్షణ వ్యవస్థలు మెజారిటీ క్షిపణులను అడ్డుకున్నాయి.

Gulf oil crisis 2026


కువైట్‌లోని అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన మినా అల్-అహ్మదిపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. వరుసగా రెండో రోజు ఇక్కడ దాడులు జరిగాయి. పలు డ్రోన్లు రిఫైనరీలోని యూనిట్లను తాకడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక రిఫైనరీ ఉత్పత్తి సామర్థ్యం (రోజుకు 7,30,000 బారెళ్లు) పాక్షికంగా దెబ్బతింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ముందు జాగ్రత్తగా కొన్ని ప్లాంట్లను మూసివేసినట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ప్రకటించింది.

Gulf oil crisis 2026 : గ‌ల్ఫ్ … హై అలర్ట్

పశ్చిమ ఆసియాలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ఇజ్రాయెల్, అమెరికా దళాలు ఇరాన్‌పై భారీ వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ దాని మిత్రదేశాలు గల్ఫ్ ప్రాంతంలోని చమురు క్షేత్రాలపై దాడులు చేస్తున్నాయి.

ఇరాన్ క్షిపణి దాడుల భయంతో దుబాయ్, బహ్రెయిన్, కువైట్ దేశాలు తమ విమానాశ్రయాల్లో కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేశాయి కొన్ని విమానాల‌ను దారి మళ్లించాయి. తమ ప్రధాన చమురు, గ్యాస్ క్షేత్రాల వద్ద ఎమర్జెన్సీ సేఫ్టీ చర్యలను అమలు చేస్తున్నాయి.వాయు రక్షణ వ్యవస్థలు (Air Defence Systems) నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్లు పేలడంతో నలుగురు గాయపడ్డారు.

ఫుజైరా (Fujairah) పోర్టు వద్ద కూడా దాడులు జరిగినట్లు సమాచారం. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం కొత్తగా దాడులు చేపట్టింది. ఇరాన్ అణు సామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఇజ్రాయెల్ ప్రకటించింది.
లెబనాన్‌లోని హెజ్బుల్లా లక్ష్యాలపై సిరియాలోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెజమిన్ నెతన్యాహు కూడా స్పందిస్తూ, “మేము గెలుస్తున్నాం, ఇరాన్ నాశనం కాబోతుంది” అని ప్రకటించారు. ఇరాన్ ఎదురుదాడి హెచ్చరికల నేపథ్యంలో మొత్తం పశ్చిమ ఆసియాలో హై అలర్ట్ కొనసాగుతోంది.

ALSO READ : Trump Seeks 200 Bn : తప్పని ఖర్చు​ Andhra Prabha Detail Report

Leave a Reply