కడెం ఎంపీడీవో బి అరుణ సస్పెన్షన్..

కడెం ఎంపీడీవో బి అరుణ సస్పెన్షన్..

కడం ఇంచార్జ్ ఎంపీడీవో గా రమేష్ రెడ్డి

నిర్మల్ జిల్లా కడం, (ఆంధ్రప్రభ)
కడం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న బి అరుణ సస్పెన్షన్ కు గురయ్యారు. కడెం మండలంలో ఇటీవల నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో కడం ఎంపీడీవో అరుణ హాజరు కాలేదు. ఎంపీడీవో ఆ కార్యక్రమానికి ఎందుకు రాలేదని జిల్లా కలెక్టర్ ఆరా తీసారు. ఎంపీడీవో అరుణ విధులకు సరిగా హాజరు కావడం లేదని తెలుసుకుని జిల్లా కలెక్టర్ స్వయంగా నిర్మల్ జడ్పీ సీఈఓ గోవింద్ కు ఫిర్యాదు చేసారు. కడం ఎంపీడీవోను సస్పెండ్ చేయించినట్లు తెలిసింది. దీంతో కడెం ఇన్చార్జి ఎంపీడీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రమేష్ రెడ్డికు అదనపు ఎంపీడీవో గా బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కడెం అదనపు ఎంపీడీవో గా రమేష్ రెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించారు.

Leave a Reply