Nomination | స‌జావుగా.. పార‌ద‌ర్శ‌కంగా చేప‌ట్టాలి

Nomination | స‌జావుగా.. పార‌ద‌ర్శ‌కంగా చేప‌ట్టాలి

నామినేషన్ల ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించిన స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్

Nomination | పెద్దవంగర, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలోని వడ్డేకొత్తపల్లి, పోచంపల్లి, అవుతాపురం గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన రెండో విడత స్థానిక ఎన్నికల నామినేషన్ కేంద్రాలను స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్ కె. మధూకర్ బాబు (K.Madhukar Babu) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుమాధవ్, ఎస్సై ప్రమోద్ కుమార్, రిటర్నింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.