Vuyyuru | అమ్మ కోసం..

Vuyyuru | అమ్మ కోసం..

  • పాడే మోయడానికి 4 గురు కాదు.. ఏకంగా 40 మంది..
  • 5 లక్షలతో పాడే ఏర్పాటు..

Vuyyuru, ఆంధ్రప్రభ : ఎవరైనా చనిపోతే పాడే మోసేందుకు నలుగురు సరిపోతారు కానీ.. 40 మంది పాడే మోసిన విచిత్ర సంఘటన ఉయ్యురులో జరిగింది. ఉయ్యూరులో ఎన్నడూ చూడని విధంగా తల్లి చివరి ప్రయాణంలో కొడుకు అసాధారణ ప్రేమ చూపించాడు. డబ్బు చాలా మందికి ఉంటుంది కానీ.. దానిని హృదయం ఉన్నవాళ్లు మాత్రమే సద్వినియోగం చేస్తారు. ఉయ్యూరుకు చెందిన బొల్లా నాని (Bolla Nani) తన తల్లి బొల్లా సముద్ర వేణి అనారోగ్యంతో శనివారం మరణించడంతో.. ఆమె చివరి ప్రయాణాన్ని పెళ్లి శోభకు ఏమాత్రం తగ్గకుండా నిర్వహించాడు.

ఐదు లక్షల ఖర్చుతో ప్రత్యేక పూలతో మెరుస్తున్నట్టుగా అలంకరణ చేశారు. మూడు ఆటో ట్రక్కులంత పూలు, మూడు ట్రక్కుల బాణాసంచా, స్మశానం వరకు మొత్తం రోడ్డు పూలతో పరచిన దారిలా మార్చేశారు. ఉయ్యూరులో ఇంత భారీ స్థాయిలో అంత్యక్రియలు ఎవరూ ఎన్నడూ చూడని రీతిలో చూసిన ప్రజలంతా ఒక్క మాటే చెప్పారు.. ఇలాంటి కొడుకు భగవంతుడు ప్రతి తల్లికి ఇవ్వాలన్నారు. ప్రేమ, గౌరవం, కన్నీళ్లు.. పూల దారి… ఒక తల్లి చివరి ప్రయాణం ఇలా కూడా ఉండొచ్చు అని ఉయ్యూరు ప్రజలు చూశారు.

Leave a Reply