Sudigali Sudheer | G.O.A.T కోసం.. మణిశర్మ..

Sudigali Sudheer | G.O.A.T కోసం.. మణిశర్మ..

Sudigali Sudheer, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బుల్లితెర పై సుడిగాలి సుధీర్ ఎంత పాపులరో తెలిసిందే. వెండితెర పై కూడా రాణించాలని హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు, కాలింగ్ సహస్ర తదితర చిత్రాల్లో నటించి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు G.O.A.T అనే సినిమా చేస్తున్నాడు. ఇది క్రికెట్ నేపధ్యంలో కామెడీ ప్రధానాంశంగా రూపొందుతుంది. ఇందులో సుడిగాలి సుధీర్, దివ్యభారతి (Divya Bharathi) జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ లో అద్భుతం, టేనంట్ వంటి అద్బుతమైన చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఒడియమ్మ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లియోన్ జేమ్స్ ఈ పాటని అదిరిపోయే లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. సుధీర్ కెరీర్‌లో ఇంత వేగంగా వైరల్ అయిన పాట ఇదే అనే చెప్పాలి. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్లి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు విడుదలైన అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. దీంతో సినిమా పై బజ్ మరింతగా పెరిగింది. ఇక ఈ మూవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ కోసం మెలోడి బ్రహ్మ మణిశర్మను (Manisharma) తీసుకున్నారు. ఆయన ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమా ఎంతో బాగా వచ్చిందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.