CAR CRASH : ఐదుగురు అక్కడిక్కడే..

CAR CRASH : ఐదుగురు అక్కడిక్కడే..

  • కోటేకల్ మలుపులో దుర్ఘటన
  • మంచు తెరలో రెండు కార్లు ఢీ
  • మృతులందరూ ఒకే ఫ్యామిలీ
  • వీరిలో చిన్నారులు ఛిద్రం
  • మరో ఇద్దరి పరిస్థితి విషమం

CAR CRASH | ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండల పరిధిలోని కోటేకల్ మలుపులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో In a serious road accident ఓ కుటుంబాన్ని మృత్యువు మింగేసింది. మంత్రాలయం బయలుదేరిన కుటుంబ సభ్యులందరూ రక్తమడుగులో అక్కడిక్కడే ప్రాణాలు వదిలేశారు. వీరిలో ఇద్దరు చిన్నారు కూడా ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆదోని ఆసుపత్రికి తరలించారని సమాచారం, ఈ దుర్ఘటన ఎలా జరిగిందంటే..కర్ణాటక కోలార్ జిల్లా – బంగారు పేటకు చెందిన వెంకటేశప్ప కుటుంబం షిప్ట్ డిజైర్ కారులో మంత్రాలయం బయలుదేరింది. ఈ కారు కోటేకల్ మలుపు దగ్గరకు చేరే సరికి కర్నూలు నుంచి ఆదోని వైపు వెళ్తున్న నల్లటి ఫార్చ్యూనర్ ఢీకొంది. ఆ సమయంలో దట్టమైన మంచు కప్పటంతో ఎదురెదురు వాహనాలు కనిపించలేదని తెలుస్తోంది. షిఫ్ట్ డిజైర్ కారులోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేశప్ప (76), సతీశ్ కుమార్ (34), మీనాక్షి (32),రీ తిక్ (5), బలిత్ గౌడ్ (4)లు ఉన్నారు. ఇద్దరు చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు చేతన్, గంగమ్మ తీవ్రంగా గాయపడ్డారు.

వాళ్లను బెలూన్లు కాపాడాయి

ఫార్చ్యూనర్‌లో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఫార్చ్యూనర్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు Passengers బెలూన్లు ఓపెన్ కావడంతో తీవ్ర ప్రమాదం తప్పింది. చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రస్తుతం ఆదోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మంచు తెరే ..అసలు కారణం


వాతావరణంలో చలి తీవ్రత Cold intensity పెరిగింది. మంచు దుప్పటి కప్పేసింది. ఈ స్థితిలోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. దీనికి తోడు అతివేగం, రహదారి మలుపు వద్ద జాగ్రత్తల లోపంమే ఈ ప్రమాదానికి దారితీసిందని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఎమ్మిగనూరు పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఐదుగురిని ఒక్కసారిగా కోల్పోయిన బంగారు పేట ప్రాంతం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎమ్మిగనూరు–కోటేకల్ రహదారి ఈ ఉదయం జరిగిన ఈ ఘటనతో మరలా రోడ్డు సురక్షతపై ప్రశ్నల మబ్బులు కమ్ముకున్నాయి.

Leave a Reply