కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా కృషి చేయాలి..

  • కాంగ్రెస్ లో భారీ చేరికలు

తిర్యాణి, ఆంధ్రప్రభ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు బాధ్యతగా పని చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు జువ్వాజీ అనిల్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరడం ఆనందకరమని ఆయన పేర్కొన్నారు.

మండల కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో, కౌటగాం గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు—పంద్రం నాగేష్, రాయిశిడం గణపతి, టేకం అంబారావు, మర్స్ కోల, బొజ్జిరావు, తుమరం చిన్ను, మెస్రం చిన్ను, పంద్రం ఓనిక్ రావు, టేకం భగవంతురావు, వెడ్మ పత్తుబాయి, కాట్లే మంజుల, పరచకి సూరిబాయి, టెక్కం బారికరావు, టేకం గంగు, కాట్లే మధుకర్, కోవా బారికరావు లతో సహా మొత్తం 50 మందికి పైగా నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి సభ్యత్వం కల్పించారు.

ఈ సందర్భంగా జువ్వాజీ అనిల్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆరు గ్యారంటీలు’ పథకాలు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసం పెంచుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదల పక్షాన నిలిచి, రైతులు, మహిళలు, వెనుకబడిన వర్గాలకు అండగా ఉన్న పార్టీ అని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా, ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ పాత్ర అమోఘమని చెప్పారు. తెలంగాణలో కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ నమ్మకమైన పాలన అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు మరింత బలపడతాయని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన పంద్రం నాగేష్ మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తమ గ్రామ పంచాయతీకి అభివృద్ధి అందలేదని గరం వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ గ్రామానికి అభివృద్ధి తీసుకురావాలన్న ఆశతో పార్టీ మార్పు చేశామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, ఆత్రం సక్కు, యూత్ ఫోర్స్ అధ్యక్షులు ఆత్రం వినోద్, పేరుమండ్ల వెంకటేశం గౌడ్, బొల్లం శంకర్, ఆత్రం తెలంగాణరావు, సీడం మోతిరం, గేడం దేవదాస్, కనక జగన్నాథ్ రావు, యూత్ అధ్యక్షులు పున్నం హరీష్ కుమార్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పడిగల అమర్, యూత్ మండల ఉపాధ్యక్షులు పులిశెట్టి రాజశేఖర్, బోగే రవి, బొజ్జ రవి, రంజిత్, గుర్రపు వెంకటేష్, చిత్తారి రాజేశం, గుర్రపు బాపు, పెరుమాండ్ల బాలేష్ గౌడ్, తీగల నరసయ్య, గున్నాల సత్య గౌడ్, కోవా శంకర్, కరిగంటి బాపు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply