Makthal | ఇందిరమ్మ చీరలు పంపిణీ

Makthal | ఇందిరమ్మ చీరలు పంపిణీ

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీలో భాగంగా మక్తల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన మహిళలకు ఇందిరమ్మ చీరలను (Indiramma sarees) రాష్ట్ర పాడి పశుసంవర్ధక క్రీడా యువజన మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Dr. Vakiti Srihari) శనివారం పంపిణీ చేశారు.

మక్తల్ (Makthal) పట్టణంలోని ఏఆర్ఎం ఫంక్షన్ హాల్లో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వార్, డీఆర్డీవో మొగులప్పతో కలిసి మహిళలకు చీరలు అందించారు. నారాయణపేట జిల్లాలో తొలిసారిగా మఖ్తల్ లోనే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి (Dr. Vakiti Srihari) తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జి.లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, కోళ్ళ వెంకటేష్, కట్టా సురేష్ కుమార్ గుప్తా, రాజప్ప గౌడ, చెన్నయ్య సాగర్, ఎంపీడీవోలు, ఏటీఎంలు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply