Tirumala |కల్తీ నెయ్యి వ్యవహారంలో మరొకరు అరెస్ట్

Tirumala |కల్తీ నెయ్యి వ్యవహారంలో మరొకరు అరెస్ట్
Tirumala | తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి సరఫరా కేసు (Adulterated ghee supply case) లో టీటీడీ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్‌మెంట్) గా పనిచేసిన RSSVR సుబ్రహ్మణ్యంను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. తిరుపతి ఎన్జీవో కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం(Subrahmanyam) ను అరెస్ట్ చేసిన అనంతరం రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇది మరో కీలక అరెస్ట్‌గా పరిగణించబడుతోంది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
