COLLEGE | ఆరోగ్య భారతి లక్ష్యం..


COLLEGE | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మనం తినే ఆహారం మన జీవనం పైన మన ప్రవర్తన పైన కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య భారతి క్షేత్ర సంఘటన కార్యదర్శి కుమారస్వామి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల (Ramakrishna Degree College) ఆడిటోరియంలో ఆరోగ్య భారతి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆరోగ్య భారతి క్షేత్ర కార్యదర్శి కుమారస్వామి పాల్గొన్నారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వ్యక్తి, ఆరోగ్య కుటుంబం, ఆరోగ్య గ్రామం, ఆరోగ్య దేశం గురించి చెప్పడం.. వాళ్లు పాటించేలా చేయడమే ఆరోగ్య భారతి లక్ష్యం అన్నారు. సీజనల్ ఫుడ్, రీజనల్ ఫుడ్ తీసుకోవాలని అది కూడా మితంగా హితకరమైనదిగా ఉండాలన్నారు. అసురస్వభావం అనే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుందని నరకాసుర నావ రావణాసుర విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు.

శ్రీకృష్ణుడు (Lord Krishna) చెప్పింది చేయాలని.. రాముడిలాగా జీవించాలని తెలిపారు. ఆరోగ్యం అంటే శారీరక మానసిక ధార్మిక వికాసం అని అందరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని, దేశాన్ని బలవర్ధకం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, ఆయుర్వేద డాక్టర్ బాల వెంకటకృష్ణ, హోమియోపతి వైద్యులు నరహరి, పుల్లయ్య, కార్యదర్శి శ్రీ విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply