Nirmal Distt | నామినేషన్ కేంద్రాలను పరిశీలన‌…

Nirmal Distt | నామినేషన్ కేంద్రాలను పరిశీలన‌…

Nirmal Distt | కడెం నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కడెం మండలంలో నిర్వహిస్తున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియ(Election Nomination Process)ను కడెం మండల తహసిల్దార్ ఆర్ ప్రభాకర్ ఎంపీడీఓ జె సునీత కడెం మండల పరిధిలోని కడెం పెద్దూర్ కొండుకూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాలను కడెం మండల తహసిల్దార్ ఆర్ ప్రభాకర్ ఎంపీడీఓ జే సునీతలు పరిశీలించారు.

ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాన్ని(Nomination Centre) పరిశీలించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు పై అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడెం ఎంపీ ఓ టి శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులు మునురుల్ హసన్ ఐ భూమేష్ కే అరుణ మమత మొయినోద్దీన్ పద్మ రాజేశ్వర్ రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply