Aditya 999 | క్రిష్‌.. తప్పుకున్నాడా..?

Aditya 999 | క్రిష్‌.. తప్పుకున్నాడా..?

Aditya 999, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ (Balakrishna) డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999. ఈ క్రేజీ మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాలి అనుకున్నారు. ఆతర్వాత బాలయ్య.. ఈ భారీ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేయాలి అనుకున్నారు. ఈ సినిమాతోనే తన వారసుడు మోక్షజ్ఞను తెలుగు తెరకు పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా ఈ క్రేజీ సీక్వెల్ ను డైరెక్ట్ చేసే బాధ్యత క్రిష్ కు అప్పగించారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని.. సమ్మర్ లో సెట్స్ పైకి వస్తుందని.. టాక్ వినిపించింది.

అయితే.. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ నంచి క్రిష్ తప్పుకున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇటీవల క్రిష్ తెరకెక్కించిన ఘాటి సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఈమధ్య కాలంలో క్రిష్‌ తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, కొండపొలం, హరి హర వీరమల్లు, ఘాటి సినిమాలు నిరాశపరిచాయి. అయితే.. గౌతమీపుత్ర శాతకర్ణి (Gautamiputra Satakarni) సినిమా చేసినప్పటి నుంచి బాలయ్యతో క్రిష్ కు మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగానే.. ఫామ్ లో లేకపోయినా ఆదిత్య 999 తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చారని ఇండస్ట్రీలో వినిపించింది. అయితే.. ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై త్వరలో అఫీషియల్ గా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Leave a Reply