మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటన…

రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఆయన పర్యటన ఉదయం 9:30 గంటలకు మంగళగిరి రాజీవ్ సెంటర్లో సత్యభామ సిల్క్స్ & హ్యాండ్లూమ్స్ షోరూం ప్రారంభోత్సవంతో మొదలవుతుంది.
అనంతరం ఉదయం 10:10 నిమిషాలకు మంగళగిరిలోని మోడల్ లైబ్రరీని ప్రారంభిస్తారు. ఉదయం 11:10 నిమిషాలకు ఆత్మకూరు సెంటర్కు చేరుకుని, అక్కడ ఎన్టీఆర్, ఎం.ఎస్.ఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు ఆత్మకూరులోని గంగానమ్మ తల్లి గుడిని సందర్శించిన తర్వాత, 12:30 గంటలకు మంగళగిరి బైపాస్, కొండపనేని టౌన్షిప్లో ఉన్న కొండపనేని పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
పర్యటన చివరి భాగంలో భాగంగా, మధ్యాహ్నం 1:10 నిమిషాలకు మంగళగిరి డిపో రోడ్, ఆటో నగర్ పరిధిలోని నూర్ మస్జీద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, చివరగా 1:50 నిమిషాలకు మంగళగిరి ఆటోనగర్లో బిస్మిల్లా మటన్ హౌస్ ప్రారంభోత్సవంతో ఆయన పర్యటన ముగుస్తుంది. ఈ కార్యక్రమాలలో నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
