73 years | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం..

73 years | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం..

73 years | రేగొండ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం మేరా యువ భారత్(Mera Yuva Bharat) వరంగల్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్(Chintala Anvesh), సూపర్డెంట్ బానోత్ దేవీలాల్ ఆదేశాల మేరకు ఈ రోజు భారత రాజ్యాంగం నిర్మించి ఆమోదించబడిన రోజుగా గుర్తు చేసుకోవడం జరిగింది.

భారత రాజ్యాంగం ఆమోదించినప్పటికీ 73 సంవత్సరాలు(73 years) పూర్తి చేసుకున్నటువంటి రోజుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ సమానత్వపు స్వేచ్ఛ న్యాయం పౌర విధులు అనేక చట్టాలన భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రోజుగా ఆమోదించబడినందుగా గుర్తు చేసుకుంటూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) చిత్రపటానికి పూలమాల వేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది.

మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే పాఠశాలలో రేగొండ మండల కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులకు భారత రాజ్యాంగాన్ని విద్యార్థులకు వివరిస్తూ అవగాహన కల్పిస్తూ ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహాత్మ జ్యోతిబాపూలే ప్రిన్సిపాల్. అపర్ణ,ఉపాధ్యాయులు మానస, రాజేంద్రప్రసాద్, మేరా యువ భారత్ వాలింటర్ వెల్దండి సురేష్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.