76th Const | డా.బీఆర్‌. అంబేడ్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాలు…

76th Const | డా.బీఆర్‌. అంబేడ్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాలు…

76th Const | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు ఇంచార్జి ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్(Bandi Srinivas) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యాపకులు మాట్లాడుతూ.. నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని స్వీకరించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.

మన రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం లాంటిదన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్(Marsakatla Anil Kumar) ఆధ్వర్యంలో 76వ రాజ్యాంగ(76th Const) దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మొదట అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, రాజ్యాంగ రచనలో అంబేద్కర్(Ambedkar) సేవలను కొనియాడుతూ విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో అధ్యాపకులు కె. బాబు, కవిరాజ్, శ్రీనివాస్, రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, సుధాకర్, బాబు అధ్యాపకేతర బృందం ప్రదీప్, గౌరీశంకర్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave a Reply