Pulicat Lake  Efect : కాళంగిలో ఉప్పు తాండవం

Pulicat Lake  Efect : కాళంగిలో ఉప్పు తాండవం

  •  పులికాట్‌  ఉప్పునీరు ఎగపోటు
  • రైతన్నల పరిస్థితి అగమ్యగోచరం
  • తాగునీటికి జనం కటకట
  • పొలిటికల్​ గేమ్​ లో తీరని సమస్య

( తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ)

రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో.. కాళంగి రైతులు అల్లాడిపోతున్నారు. తాగు, సాగునీటి కోసం పరితపించి పోతున్నారు. ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. పోతున్నాయి. కానీ కాళంగి నది పరివాహిక ప్రాంత రైతులు.. ప్రజల దాహార్తి తీరటం లేదు. ఉప్పు నీటి కయ్య (Salt Waer ) లో చిక్కుకుని కుయ్యో మొర్రో అంటున్నారు.

అధికారంలోకి రాగానే కాళంగి (Kalangi River)  సమస్య అంతుతేలుస్తామని గొప్పలు పోతున్నారు. ఎన్నికల సమయం వచ్చే వరకూ కనీసం నిక్కి చూడటం లేదు. తాజా కూటమి ప్రభుత్వం తమ వ్యథను అర్థం చేసుకుని ఉప్పునీటి సమస్యను పరిష్కరించాలని జనం వేడుకొంటున్నారు. అసలు.. తాగునీటి నదిలో.. ఉప్పునీరు ఎలా కలిసింది. పాతాళగంగలో ఉప్పునీరు పరవళ్లు కథ ఏమిటీ తెలుసుకుందాం.  

Pulicat Lake  Efect : అసలు కథేంటబ్బా..

తిరుపతి జిల్లా సూళ్లూరు పేటకు అతి సమీపంలోని పులికాట్ ​ ఉప్పునీటి సరస్పు    ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ   సరస్సు ముఖ ద్వారంలో కాళంగి నది ఉంది. ఈ నది పరివాహిక ప్రాంతంలోని  రైతులకు సాగు , తాగునీటికి .. ఈ నదే ఆధారం. నదిలో  నీటి ప్రవాహం లేని రోజుల్లో  పులికాట్‌ సరస్సులోని ఉప్పునీరు (Pulicat Lake  Efect)   కాళంగి నదిలోకి ఎదురెక్కుతుంది. అంతే.. కాళంగి నదిలో ఉప్పునీరు చేరుతుంది. ఫలితంగా భూగర్భ జలాలూ ఉప్పు నీరుగా మారటం సర్వసాధారణం.

Pulicat Lake  Efect

సరీగా ముప్పై మూడేళ్ల కిందట..  1992లో అప్పటి మంత్రి పసల పెంచలయ్య (Pasala Penchalaiah)  హాయాంలో కాళంగి గ్రాయిన్‌  నిర్మాణానికి పునాది పడింది. ఎట్టోగట్టా అరకొరగా గ్రెయిప్​ సమకూరింది. కానీ ..  ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. అధ్వాన్నంగా మారింది. Pulicat Lake  Efect ఉప్పునీరు ఎగతన్నుతోంది. కాళంగి నదిలో  ఉప్పు నీరు చేరి.. పంటలకు, ప్రజలు తాగడాకి వీలుకాని పరిస్థితి నెలకొంది..  

 ఏన్నో ఏళ్లుగా  ఈ సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు.   ప్రజా ప్రతినిధులు హామీలు దంచుతుంటే..  అధికారుల ప్రతిపాదన ఫైళ్లకు బూజు పట్టిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఓట్లకు గాలం వేయటానికి ఎన్నికలకు ముందు  నిధులు మంజూరు చేస్తే కాంట్రాక్టరు పారిపోయాడు. ఈలోపు వరదలొచ్చాయి. ఎలచ్చన్ల కోడి కూసింది. ఇంకేముందీ.. మళ్లీ కాళంగి నది ట్రబుల్​ ​ రిటర్న్ జర్నీ తెరమీద దీనంగా కనిపిస్తోంది. ​

Pulicat Lake  Efect : కాళంగికి ఉప్పు పోటు

సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని  దొర వారి సత్రం (Doravari Satram), సూళ్లూరుపేట (Sulluripeta)   మండలాల్లో  ప్రవహించే కాళంగి నది తడ (Tada) మండల సమీపంలోని పులికాట్‌ సరస్సు సమీపంలోని  సముద్రంలో కలుస్తుంది. కాళంగి నది నీటితో  పరివాహిక ప్రాంతాల్లోని  రైతులు సుమారు 15 వేల ఎకరాల్లో  వరి  సాగు చేస్తున్నారు.  

Pulicat Lake  Efect

సూళ్లూరుపేట పట్టణంతో పాటు- వాటంబేడు (Watambedu) నుంచి మన్నారు పోలూరు, చెల్లెమ్మ బొంద వరకూ బావులు, బోర్లను (Wells, Bores)  వినియోగించి   రైతులు పంటలు పండిస్తున్నారు. సూళ్లూరుపేట పట్టణంలో సుమారు లక్ష మంది , పల్లెల్లో మరో 10 వేలు మంది, షార్‌ కాలనీల్లో సుమారు 7 వేల మందికి తాగునీరు కావాలంటే  బోర్లే ఆధారం. ప్రస్తుతం బోర్లు, బావుల్లో   ఉప్పు నీరుగా ప్రత్యక్షమైంది. ఇక  జనం తాగునీటికి అల్లాడిపోతున్నారు. బావుల్లో నీరు తాగలేరు. తప్పని స్థితిలో   తాగునీటిని కొనుగోలు చేసే స్థితి ఏర్సడిందని జనం  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pulicat Lake  Efect : ఎన్నికల వేళ వైసీపీ తాయిలం..

 గత వైసీపీ ప్రభుత్వంలో ( YCP Government)  కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి చేసేలా అప్పటి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రత్యేక దృష్టి సారించారు.  ఇరిగేషన్‌ శాఖ మంత్రితో కలిసి కాళంగి గ్రాయిన్‌ను పరిశీలించారు. ఈ సమస్యను  అప్పటి  సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.  నిధులు మంజూరు చేయించారు.   ఈ పనులకు కాంట్రాక్టర్‌  ముందుకు రాలేదు. ఇక  వరదలు వచ్చాయి,,  ఎన్నికల కోడి కూడా (Ellection Code)  కూసింది. అంతే కాళంగి అభివృద్ధి కల  అర్ధాంతరంగా మైంది.  

1Pulicat Lake  Efect : 1992లో  పునాది

కాళంగి నదిలో పులికాట్‌ సరస్సు ఉప్పు నీరు కలుస్తోందని గుర్తించిన అప్పటి మంత్రి పసల పెంచలయ్య 1992లో   ప్రపంచ బ్యాంకు (World Bank)  నిధులతో తడ మండల పరిధిలోని వాటంబేడు దగ్గర   పులికాట్‌ సరస్సులో కాళంగి నది కలిసే ప్రాంతంలో గ్రాయిన్‌ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో దీనికి మంజూరైన నిధులు చాలకపోవడంతో బొంతరాళ్లతో గ్రాయిన్‌ నిర్మించి వదిలేశారు.

ఆ తరువాత టీ-డీపీ (TDP) ప్రభుత్వం  పట్టించుకోలేదు. 2001లో తుపాను దాటికి కాళంగి గ్రాయిన్‌ తెగిపోయింది.  మళ్లీ  ఉప్పునీరు (Salt Water) పైకి (Flew away) ఎగబాకింది.  వాటంబేడు, చేనిగుంట, గ్రద్ద గుంట రైతులు   కలిసి ఇసుక బస్తాలతో (Sand Bags)   తాత్కాలిక నష్టనివారణ చేపట్టారు. కొంతమేర నష్టాన్ని తగ్గించుకున్నారు. 2004 నుంచి 2014 వరకు  కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Government)  కూడా గ్రాయిన్‌ అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.

Pulicat Lake  Efect : నిదులూ  తూతూ మంత్రమే

2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో రూ.35 లక్షలతో కాళంగి గ్రాయిన్‌ పనులు తూతూ మంత్రంగా చేపట్టింది.  ఈ పనులు మూన్నాళ్ల ముచ్చటగానే  గ్రాయిన్‌ (Groin)  కొట్టు-కు పోయింది. తరువాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌లు శిథిలావస్థలో ఉన్న కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి విషయాన్ని అప్పటి  సీఎం  వైఎస్‌ జగన్​ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సానుకూలంగా స్పందిచి రైతులు, ప్రజల సౌకర్యార్ధంగా కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి చేసేందుకు తొలుత రూ 8.3 కోట్లు-  మంజూరు (Sanctioned)  చేశారు. తర్వాత అంచనాలను సవరించి రూ11 కోట్లు- కేటాయించారు. ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఇక తెరపడుతుందని భావించిన రైతుల ఆశలు నిర్వీర్యం అయ్యాయి. కాంట్రాక్టర్‌ సకాలంలో పనులు చేపట్టలేదు,  వరదలకు , ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో పనులు ముందుకు సాగలేదు. తరువాత జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

Pulicat Lake  Efect : ఎమ్మెల్యే  మేడమ్​ ..ప్లీజ్​ ..

సూళ్లూరుపేట నియోజకవర్గంలో పోటీ- చేసిన నెలవల విజయశ్రీ (Mla Vijayasri)  విజయం సాధించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి (Dovelopmet Works)  పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా శిథిలావస్ధకు చేరుకుని ఉన్న కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధిపై దృష్టిసారిచాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

ఇటీ-వల నాయుడుపేట పర్యటనకు వచ్చిన ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Irrigation Minister)  దృష్టికి కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి విషయమై చర్చించి ఉన్న నేపధ్యంలో నిధులు మంజూరు చేయించి కాళంగి గ్రాయిన్‌ను అభివృద్ధి చేసేలా పూర్తి స్ధాయిలో దృష్టి సారిస్తే ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి మంచి గుర్తింపు రావడంతో పాటు- రైతులు, ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటు-న్న సమస్యకు పరిష్కారం కానుంది.

Pulicat Lake  Efect : కాళంగిని కాపాడండి

Pulicat Lake  Efect

శిధిలావస్థలో ఉన్న కాళంగి గ్రాయిన్‌ ను అభివృద్ధి చేసేలా అధికారులు, పాలకులు దృష్టిసారించాలి. కాళంగినదిలో ఉప్పునీరు చేరడం వల్ల సాగు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం.

 Pulicat Lake  Efect : కారికాటి రాజేంద్ర  (రైతు)

 తాగునీటికి ఇబ్బంది  పడుతున్నాం

Pulicat Lake  Efect

కాళంగి నది ద్వారా సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం మండలాల పరిధిలో సుమారు 15వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ నదిలో పులికాట్‌ సరస్సు ఉప్పునీరు కలవడం వల్ల వ్యవసాయ సాగు, తాగునీటికి అవస్థలు పడుతున్నాం. త్వరితగతిన కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి చేయాలి.

వి.అశోక్‌ కుమార్‌ (రైతు)  

 Pulicat Lake  Efect : ఉప్పునీరుతో అల్లాడుతున్నాం

కాళంగి గ్రాయిన్‌ దెబ్బతినడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పునీరుగా మారిపోయాయి. తాగునీరు కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు, పాలకులు ప్రత్యేక దృష్టి సారించి శిధిలావస్థలో ఉన్న కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి చేసి పుణ్యం కట్టు-కోవాలి.

వి.మహేంద్ర (రైతు)  

Pulicat Lake  Efect : రూ 24.68 కోట్లతో ప్రతిపాదించాం

Pulicat Lake  Efect

శిధిలావస్థలో ఉన్న కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి చేసేలా రూ 24.68కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్దం చేసి పంపించడం జరిగింది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే -టె-ండర్లు పిలిచి కాళంగి గ్రాయిన్‌ లోకి పులికాట్‌ సరస్సు ఉప్పునీరు రాకుండా చెక్‌డ్యాంలు ఏర్పాటు-.. నదికి ఇరువైపులా పొర్లుకట్టలను కాంక్రీట్‌ వాల్‌ తో పటిష్టం చేస్తాం.. అలాగే రోడ్డు సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది.

ఉచ్చూరు రమేష్‌, ఇరిగేషన్‌ ఏఈ

Also Read : Spurious Seeds | రైతన్నకు వెన్నుపోటు