Rs 35 lakhs | రూ.35 లక్షలతో సీసి రోడ్డు..

Rs 35 lakhs | రూ.35 లక్షలతో సీసి రోడ్డు..

Rs 35 lakhs | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఈజీఎస్ నిధులతో రూ.35 లక్షల(Rs 35 lakhs)తో సీసి రోడ్డు పనులను ఏఎంసీ వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి(Sunketa Ravi) కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్సీ ఆఫీస్ రోడ్డుకు రూ.10 లక్షలు,ఉప్లూర్ రోడ్డు నుండి గౌడ సంఘం రోడ్డుకు రూ.10 లక్షలు, మినీ స్టేడియం(Mini Stadium) రోడ్డుకు రూ.5 లక్షలు, స్మశానం రోడ్డుకు రూ.5 లక్షలు(Rs.5 lakhs), గొల్లపేట కాలనీ లో రూ.5 లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజక వర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సల్లూరి గణేష్ గౌడ్, సింగిరెడ్డి శేఖర్, కౌడ శైలేందర్, వేములవాడ జగదీష్,అల్గోట్ రంజిత్, దులూర్ కిషన్,సంపంగి నాగరాజు, పడాల గంగాధర్,ఎడ్ల దీపక్,నల్ల సాయి కుమార్,శివసారం నరేష్,సుంకరి గంగాధర్,ముత్యాల చంద్రకాంత్ రెడ్డి, పాలెపు చిన్న గంగారాం,అజహర్ తదితరులు పాల్గొన్నారు.