PM Modi | సంత‌కాల సేక‌ర‌ణ‌…

PM Modi | సంత‌కాల సేక‌ర‌ణ‌…

PM Modi | డోంగ్లి, ఆంధ్రప్రభ : ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ(Congress Party) కార్యాలయంలో ఈ రోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ డోంగ్లీ మండల అధ్యక్షుడు గజానంద్ దేశాయి(Gajanand Desai) ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థ స్వయం పాలన, స్వీయ నిర్ణాయాధికారం కాపాడడానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. దొంగ ఓట్లతో నరేంద్రమోదీ(Narendra Modi) అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ శివాజీ పటేల్, నాయకుడు ఉమాకాంత్ పటేల్, వసంతరావు పాటిల్, మాజీ ఎంపీటీసీ దీన్ దయాల్, లక్ష్మణ్ పాటిల్ బాచావర్, సంగ్రామ్ పాటిల్, శివారెడ్డి, శ్రీధర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply