Peddapalli | ఆత్మహత్య.?

Peddapalli | ఆత్మహత్య.?
Peddapalli , పెద్దపల్లి, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతూ మహిళ మినీ ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పట్టణంలోని తిలక్ నగర్ లో నివాసముంటున్న బొడ్డుపల్లి కనకమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని, దాన్ని భరించలేక మినీ ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని బంధువులు తెలియజేశారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు (Police) సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
