Sarpanchs | సర్పంచుల బాధ్యతల స్వీకరణకు కొత్త తేదీ

Sarpanchs | సర్పంచుల బాధ్యతల స్వీకరణకు కొత్త తేదీ
Sarpanchs | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల అపాయింట్‌మెంట్ డే (Appointment day)ను ప్రభుత్వం వాయిదా వేసింది. ముందుగా ఈ నెల 20 నుంచి 22 వరకు నిర్ణయించిన కార్యక్రమాన్ని, ప్రజాప్రతినిధుల అభ్యర్థనల నేపథ్యంలో పూర్తిగా 22వ తేదీకి మార్చాలని పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 22న రాష్ట్రవ్యాప్తంగా నూతన సర్పంచులు (Sarpanch) బాధ్యతలు స్వీకరించనున్నారు.
