Irrigation Scheme | నాగటూరు లిఫ్ట్ ఎత్తిపోతల యంత్రాల మరమ్మతుకు 38 లక్షల మంజూరు….

Irrigation Scheme | నాగటూరు లిఫ్ట్ ఎత్తిపోతల యంత్రాల మరమ్మతుకు 38 లక్షల మంజూరు….

  • ఎత్తిపోతల పథకం రైతుల కళ్ళలో ఆనందం.
  • జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కు అభినందనలు.
  • రైతుల శ్రేయస్సు కూటమి ప్రభుత్వ ధ్యేయం.

Irrigation Scheme | నందికొట్కూరు ఆంధ్రప్రభ : నాగటూరు ఎత్తిపోతల పథకం యంత్రాలు మరమ్మతుకు నోచుకోక దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచిపోతున్న రైతులు వర్షాధార పంటలు వేసుకునే పంటలు ఎండిపోవడం అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు ఆరు కాలం కష్టించి పండించిన పంటలు చేతికి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లి న ఎమ్మెల్యే గిత్త జయ సూర్య

నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య దృష్టికి ఎత్తిపోతల పథకం మోటర్లు మరమ్మతుకు రావడంతో పాటు ట్రాన్స్ఫారం లేకపోవడం ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి న ఎమ్మెల్యే గిత్త జయ సూర్య కృషి ఫలించింది.

సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మోటార్ల మరమ్మతుకు ట్రాన్స్ఫారంలో ఏర్పాటుకు 38 లక్షలు మంజూరు చేస్తూ ఎమ్మెల్యే కు అనుమతి పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య మాట్లాడుతూ గత వైసిపి పాలనలో నాగటూరు ఎత్తిపోతల పథకం మరమ్మతులకు గురైనప్పటికీ పట్టించుకునే నాధుడు కరువయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాగ టూరు ఎత్తిపోతల పథకాన్ని స్వయంగా పరిశీలించి ఎత్తిపోతల పథకం రైతు కమిటీతో చర్చించి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే జిల్లా కలెక్టర్ మరియు ఇరిగేషన్ అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకం సమస్యను పరిష్కరించినందుకు నివేదికలు తయారు చేయడం జరిగిందన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ 38 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో రైతు కమిటీ సభ్యులతో కలిసి నిధుల పత్రమును అందుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రైతులు, లిఫ్ట్ ఇరిగేషన్ రైతు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, కలెక్టర్ రాజకుమారి గని యా లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జూపాడు బంగ్లా మండల కన్వీనర్ గుండ్రెడ్డి మోహన్ రెడ్డి, పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి, లక్ష్మాపురం షమీం చిన్నయ్య, ఖాదర్, నాగటూరు మల్లికార్జున్ రెడ్డి, కొణిదెల బ్రహ్మానంద రెడ్డి, సగినేల హుస్సేనయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.