Metro | మార్చి నెల మెట్రోకు కీలకం..

Metro | మార్చి నెల మెట్రోకు కీలకం..

Metro, హైదరాబాద్, ఆంధ్రప్రభ : మార్చిలో హైదరాబాద్ (Hyderabad) మెట్రో దశ మారనున్నది. హైదరాబాద్ మెట్రో రైలుకు రాబోయే మార్చి నెల ఎంతో కీలకం కానుంది. మార్చి 31 లోగా మొదటి దశ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. రెండో దశలో విస్తరణ ప్రతిపా దనల్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించి మార్చిలోపు అనుమతుల పై నిర్ణయం తీసుకుంటామని మరో వైపు కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో రెండు కీలక ఘట్టాలకు మార్చి వేదిక కానుంది.

విస్తరణలో భాగంగా మెట్రోరైలు (Metro Train) 2(ఏ)లో 5 మార్గాలు ఉన్నాయి. 2(బి)లో 3 మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి భాగస్వామ్యంలో నిర్మించాలని నిర్ణయించారు. అనుమతుల కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు పంపింది. వీటి పై మార్చిలో కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. మొదటిదశ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోతో జరిగిన చర్చల్లో ప్రాజెక్టును సర్కారుకు స్వాధీనం చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పింది. దీంతో ప్రతిష్ఠంభన తొలగింది. ఇలా స్వాధీనం ప్రక్రియను మార్చి 31 వరకు పూర్తి చేసేందుకు చర్యలను తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం 8 మార్గాల్లో విస్తరణకు ప్రతిపాదించింది. అనుమతులు ఇవ్వాలని కోరుతోంది.

హైదరాబాద్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలోపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈలోపే టోకోవర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ మెట్రోకి రూ.13 వేల కోట్ల రుణాలు ఉన్నాయి. అయితే.. ఇక్కడ సాంకేతిక అవరోధాలు ఎన్నో ఉన్నాయి. సికింద్రాబాద్, (Secundrabad) సెనత్నగర్, ఖైరతాబాద్, సుచిత్ర, అల్వాల్, ఘట్కేసర్, మల్కాజిగిరి నుంచి ఐటీ ఉద్యోగులు ఎంఎంటీఎస్లో రాకపోకలు సాగిస్తుంటారు. తిరుగు ప్రయాణంలో సరిపడా రైళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా 15 కోచ్ల మెమూ రైళ్లు, 10 నుంచి 15 నిమిషాల ఫ్రీక్వెన్సీని అమలు చేస్తే ప్రయాణికుల సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ 12కోచ్ల సామర్థం (3500 నుంచి 3800 మంది), అదే 15 కోచ్లున్న మెమూ రైలు సామర్థం 4500 నుంచి 5000 మంది వరకు (ఇందులో స్టాండింగ్ సహా). అలా కోచ్లను పెంచడం వల్ల 30 నుంచి 40 శాతం సామర్థ్యం పెరుగుతుంది.

దీంతో రద్దీని నియంత్రించడంతో పాటు ఫ్రీక్వెన్సీ పెరగనుంది. అలాగే రైల్వే ప్రజా రవాణా మెరుగుపడనుంది. ప్రస్తుతం లింగంపల్లి నుంచి ఫలక్నుమాకు (Falaknuma) ప్రతి 15 నుంచి 20 నిమిషాలకో రైలు నడుస్తోంది. ఈ సమయాన్ని 10 నిమిషాలకు తగ్గిస్తే మెరుగైన సేవలు అనేవి అందనున్నాయి. ఫలక్నుమా -లింగంపల్లి మార్గంలో నడిచే ఒక్కో ఎంఎంటీఎస్ రైలులో నిత్యం 3 వేల నుంచి 4 వేల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. ఇంత డిమాండ్ ఉన్నా ఆయా మార్గాల్లో రైళ్లు నడపడం లేదు. దీంతో చాలా మంది ప్రత్యామ్నాయాలను ఎంచుకొని ట్రాఫిక్ నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ మార్గంలో రైళ్లు నడపా లని ప్రయాణికులు సైతం కోరుకుంటున్నారు.

మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
https://epaper.prabhanews.com