Huzurnagar | మత్స్య కార్మికులకు అండగా ప్రభుత్వం

Huzurnagar | మత్స్య కార్మికులకు అండగా ప్రభుత్వం

మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక దేశుముఖ్


Huzurnagar | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్య కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని హుజూర్‌నగర్ (Huzurnagar) వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్ దేశుముఖ్ (Radhika Arun Kumar Deshumukh) అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరగడ్డ గ్రామంలో మత్స్య కార్మికులకు 100% సబ్సిడీపై చేపపిల్లల పంపిణీ చేసి బూరుగడ్డ లోని నల్లచెరువులో సుమారు రెండు లక్షల చేప పిల్లలు పోయడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడుతూ… అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) నేతృత్వంలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. చెరువు సొసైటీ సభ్యులు సబ్సిడీ పై అందించిన చేప పిల్లలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారులు ఉపేందర్ రావు, మల్లికార్జున్, పంచాయితీ కార్యదర్శి పద్మ, ఎఈఓ అన్నపూర్ణ చెరువు సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply