NZB | తృటిలో తప్పిన ప్రమాదం..

బాల్కొండ, (ఆంధ్రప్రభ): నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం జరిగిన ఘటన పెద్ద ప్రమాదాన్ని తృటిలో తప్పించింది. సాధారణంగా రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చెట్టు కొమ్మ అకస్మాత్తుగా విరిగి పడింది. అయితే, అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

కొమ్మ పడి పక్కనే పార్క్ చేసి ఉన్న తహసీల్దార్ కారు స్వల్పంగా దెబ్బతింది. అలాగే కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి బైకు మీద కూడా కొమ్మ పడడంతో వాహనం ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది. ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఉపశమనం వ్యక్తం చేశారు.

Leave a Reply