Droupadi Murmu | పద్మావతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్రపతి…
Droupadi Murmu | పద్మావతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్రపతి…
తిరుపతి, తిరుచానూరు (ఆంధ్రప్రభ): రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా తిరుచానూరుకు చేరుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనిత, టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఘన స్వాగతం పలికారు.
ఆలయ ముఖద్వారం వద్ద అర్చకులు సంప్రదాయ మర్యాదలతో ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రపతి ధ్వజస్తంభం వద్ద మొక్కులు చెల్లించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.
దర్శనం తరువాత వేదపండితులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. ఆపై ఆశీర్వాద మండపంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆమెకు అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్‌వో కే.వి. మురళీకృష్ణ, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అనంతపురం డిఐజీ సీమోషీ ఘోష్, టిటిడి బోర్డు సభ్యులు జి. భానుప్రకాశ్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు స్వామి తదితరులు పాల్గొన్నారు.
